logo

ఆల్ ఇండియా కల్పాచార్య అవార్డు అందుకున్న అనకాపల్లి వాసి కొమ్మోజు రమేష్

ఆకర్ష్ టీవీ: ప్రముఖ బ్రైనో విజన్ కంపెనీ మరియు భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డులు 2024 టీం సౌజన్యంతో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో వైవి ఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆదివారం అనగా 21-4-2024 న జరిగిన ఆల్ ఇండియా అవార్డ్స్ ఫంక్షన్ లో అనకాపల్లికి చెందిన కొమ్మోజు రమేష్ కి 2022-23 సంవత్సరానికి గాను ఎడ్యుకేషన్ సెక్టర్లో తనదైన శైలిలో సేవలందించినందుకు గాను ఆల్ ఇండియా కల్పాచార్య అవార్డు ని కైవసం చేసుకున్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ చీఫ్ కోఆర్డినేట్ ఆఫీసర్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ టీవీజీడి ప్రసాద్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్ ఆంధ్ర యూనివర్సిటీ, ప్రత్యేక అతిథిగా భాస్కర్ గంధవాడి, చేతుల మీదుగా అవార్డుని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ ఆల్ ఇండియా అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని దీంతోపాటుగా ఈరోజు విశాఖపట్నం వేదికగా హాజరైన ఆల్ ఇండియా వైడ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో సమాజానికి అనేక విధాలుగా సేవలు అందిస్తున్న గురువులని ఈ ప్రదేశంలో కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆల్ ఇండియా లెవెల్ అవార్డ్స్ ఫంక్షన్ కి వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ,తమిళనాడు ,పాండిచ్చేరి ,గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్ ,రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గురువులను తోటి ఉపాధ్యాయులు కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు బీజం వేసి విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న బ్రైనోవిజన్ అధినేత గణేష్ నాగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

0
0 views